నూతన్ నాయుడు భార్య మళ్లీ అరెస్ట్.. ఈ సారి ఎందుకంటే?

Friday, October 9th, 2020, 08:30:34 AM IST

సినీ నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు కుటుంబానికి మరో షాక్ తగిలింది. గతంలో దళిత యువకునికి శిరోముండనం చేయించిన ఘటనలో అరెస్ట్ అయిన నూతన్ నాయుడు భార్య మధుప్రియ మరోసారి అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసులో నిన్న బెయిల్‌పై విడుదలైన మధుప్రియను కొద్ది గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన దగ్గర మధుప్రియ 25 లక్షలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి మోసం చేసినట్టు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 20 వరకు ఆమెకు కోర్టు రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది.