విశాఖ శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు అరెస్ట్..!

Friday, September 4th, 2020, 06:46:18 PM IST

సినీ నిర్మాత, బిగ్‌బాస్ ఫేం నూతన్‌కుమార్ ‌నాయుడు ఇంట్లో జరిగిన శిరోముండనం ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో నూతన్‌నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నూతన్‌ భార్య ప్రియమాధురిని అరెస్ట్ చేసిన పోలీసులు నేడు ఉడిపిలో నూతన్‌ను అరెస్ట్ చేసినట్లు మీడియాకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీసీ ఫుటేజీతో పాటు కీలక ఆధారాలు సేకరించామని, ఈ ఘటనలో నూతన్‌నాయుడు ప్రమేయం ఉందని సీపీ మనీష్ కుమార్ సిన్హా స్పష్టం చేశారు.

నిర్మాత నూతన్‌‌కుమార్ ‌నాయుడు ఇంట్లో కర్రి శ్రీకాంత్‌ అనే ఓ యువకుడు కొద్దిరోజులు పని చేసి మానేయగా, నూతన్‌ నాయుడు ఇంటి భద్రతా సిబ్బంది ఆ యువకుడినిన్ మళ్ళీ పిలిపించి పని ఎందుకు మానేశావని ప్రశ్నించారు. ఆ తరువాత ఈ ఇంటికి వచ్చిన బ్యూటీషియన్‌ సెల్‌ఫోన్‌ హ్యాక్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించావంటూ దుర్భాషలాడుతూ, క్షురకుడిని పిలిపించి శిరోముండనం చేయించారు. ఆ సమయంలో నూతన్‌ భార్య అక్కడే ఉన్నారని బాధితుడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.