సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపిన ఎన్‌టీఆర్ తనయుడు..!

Friday, September 11th, 2020, 07:26:13 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడు నందమూరి రామకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడం పట్ట సంతోషం వ్యక్తం చేసారు. నందమూరి కుటుంబ సభ్యుల తరుపున అభిమానుల తరుపున కేసీఆర్‌కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ యావత్ ప్రపంచమంతటా తెలుగు ప్రజలు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గర్వపడుతున్నారని, అంతటి మహనీయుని జీవిత చరిత్రను తెలంగాణ పాఠశాల సిలబస్‌లో చేర్చి పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశం చేయటం భావితరాలకు తప్పకుండా మార్గదర్శకం అవుతుందని, ఎన్టీఆర్ గారిలో ఉన్న నీతి, నిజాయితీ, కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిబద్దత, ఇవన్నీ భావితరాల విద్యార్థులు స్పూర్తిగా తీసుకుంటే ఉత్తమ పౌరులుగా తయారవుతారన్నారు. అయితే దీనిపై ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కూడా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.