2009 యాక్సిడెంట్ పై ఎన్టీయార్ సంచలన వ్యాఖ్యలు..?

Monday, January 25th, 2016, 05:56:35 PM IST

ntr
2009 లో ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం చేసే సమయంలో ఎన్టీయార్ కారు యాక్సిడెంట్ కు గురయింది. 2009 మార్చి 26 వ తేదీన జూనియర్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి నల్గొండ సమీపంలో ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు దాని గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చావుకు భయపడని వ్యక్తని.. అందరు ఏదో ఒక సమయంలో మరణించవలసిన వ్యక్తులే అని చెప్పారు. మార్చి 26 వ తేదీనే ఎన్టీయార్ భార్య లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు కూడా కావడంతో.. ఆరోజున ఇంట్లో రెండు పుట్టిన రోజులు జరుపుకుంటామని చెప్పారు.

ఇకపోతే, జూనియర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నది. ఈ సినిమా విజయం సాధించడంతో పాటు అటు యూఎస్ లో వసూళ్ళలో దూసుకుపోతున్నది. 2009లో జరిగిన ఆ యాక్సిడెంట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఇటీవలే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు. జీవితంలో సాధించవలసినది చాలా ఉన్నదని చెప్పారు. జీవితంపైన ఆశ తోనే ప్రతి మనిషి జీవిస్తాడని అన్నారు.