రూట్ మారింది.. ఏపీలో ఎన్టీఆర్, ఎర్రనాయుడు విగ్రహాల ధ్వంసం..!

Wednesday, January 13th, 2021, 01:46:10 AM IST

ఏపీలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. అయితే మొన్నటి వరకు హిందూ దేవాలయాలపై, దేవుళ్ళ విగ్రహాలపై దాడులు జరగగా ఇప్పుడు అది కాస్త యూటర్న్ అయ్యి రాజకీయ నేతల విగ్రహాల వైపు మళ్ళింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలో ఎంపీడీవో ఆఫీస్ దగ్గర ఉన్న మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహంతో పాటు మాజీ ఎంపీ, స్వర్గీయ ఎర్రన్నాయుడు విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు స్వల్పంగా ధ్వంసం చేశారు.

అయితే ఎన్టీఆర్ విగ్రహం, ఎర్రన్నాయుడు విగ్రహాల ముఖ భాగాలు ధ్వంసం కావడంతో విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. తమ నేతల విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను పట్టుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్థానిక నేతలు సంతబొమ్మాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.