ఈతకెళ్ళి మృతి చెందిన తెలుగు ఎన్ఆర్ఐ!

Wednesday, July 29th, 2015, 05:05:52 PM IST


అమెరికా అట్లాంటా నగర సమీపంలోని నదిలో ఈత కొట్టేందుకు వెళ్ళిన తెలుగు ఎన్ఆర్ఐ ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. ఇక వివరాలలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అన్నంభొట్లవారిపాలెం గ్రామానికి చెందిన 25ఏళ్ళ కౌశిక్ చిలుకూరి అమెరికాలో ఎంఎస్ విద్యను పూర్తి చేసుకుని ఇటీవలే సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఇక వారంతంలో అట్లాంటా నగరం సమీపంలోని నదిలో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయినట్లు సమాచారం. ఇక కౌశిక్ మరణ వార్తతో అతని గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా కౌశిక్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని, శుక్రవారం నాటికి రావచ్చునని కుటుంబ సభ్యులు తెలిపారు.