యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాటి కోసం ఓ టూల్!

Monday, February 29th, 2016, 06:06:33 PM IST


యూట్యూబ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన వీడియో షేరింగ్ వెబ్ సైట్. అటువంటి యూట్యూబ్ లో నిత్యం ఎంతోమంది ఎన్నో వీడియోలను అప్ లోడ్ చేస్తూ ఉంటారు. అయితే, యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేసే యూట్యూబ్ యూజర్లకు ఓ విషయంలో మాత్రం కాస్త నిరాశ ఎదురవుతూ ఉంటుంది.

అది ఏమిటంటే.. కొన్ని వీడియోలలో కొన్ని అంశాలు చూపించకుండా సెన్సార్ చేయాలని అనుకోవడమే. దీనికి తగిన సౌకర్యం యూట్యూబ్ లో లేకపోవడంతో యూజర్లకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెడుతూ యూట్యూబ్ వినియోగదారుల కోసం ‘బ్లర్ టూల్’ ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ టూల్ ద్వారా వీడియోలో వేటినైతే నిషేధించాలని అనుకున్నారో వాటిపై బ్లర్ చేయొచ్చని, షార్ట్ ఫిల్మ్స్ తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేవారికి ఈ బ్లర్ టూల్ చాలా ఉపయోగపడుతుందని సమాచారం. ఈ సందర్భంగా ఈ టూల్ ద్వారా ఫోన్ నెంబర్స్, క్రెడిట్ కార్డ్ నెంబర్స్, నెంబర్ ప్లేట్స్, కొన్ని ఇబ్బందికర సన్నివేశాలు తదితర వాటిని బ్లర్ చేయడం వల్ల భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రావని యూట్యూబ్ తెలియజేస్తుంది.