తెలంగాణ లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన నామినేషన్లు

Wednesday, February 24th, 2021, 08:42:10 AM IST

తెలంగాణ రాష్ట్రం లో జరగాల్సిన రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే రెండు స్థానాల కోసం వంద మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే 24 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా, 26 వ తేది సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణ కి గడువు ఉంది. అయితే అదే రోజు సాయంత్రం అభ్యర్ధుల తుది జాబితా తెలుస్తుంది. అయితే మార్చి 14 వ తేదీన పోలింగ్ జరగనుంది. మార్చి 17 వ తేదీన ఇందుకు సంబంధించిన ఫలితాలు వెల్లడవుతాయి.

తెలంగాణ రాష్ట్రం లో కీలకం అయిన హైదరబాద్- రంగారెడ్డి – మహబూబ్ నగర్ మరియు ఖమ్మం – వరంగల్ నల్గొండ జిల్లాల కి సంబందించి జరగనున్న ఈ ఎన్నికలు ప్రతి ఒక్కరికీ ముఖ్యం అని చెప్పాలి. అటు అధికార పార్టీ, ఇటు ప్రతి పక్ష పార్టీ నేతలు ఈ ఎన్నికల లో విజయం సాధించాలని కృషి చేస్తున్నారు.