ఒక్క కరోనా కేసు కూడా లేని దేశాల లిస్ట్ ఇదే..!

Tuesday, April 7th, 2020, 12:00:02 AM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుంది. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ అతి తక్కువ కాలంలోనే వందలాది దేశాలకు విజృంభించింది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వేలాది మంది మరణించారు. అయితే దీనిని అరికట్టేందుకు ప్రపంచదేశాలన్ని ఒక్కటై పోరాటం చేస్తున్నాయి.

ఈ వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు చాలా దేశాలు ఇప్పటికే లాక్‌డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ కారణంగా అగ్ర దేశాలు కూడా అల్లాడుతుంటే కొన్ని దేశాలలో మాత్రం దీని ప్రభావం ఏ మాత్రం లేదు. ఎంతలా అంటే ఆ దేశాలలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. పసిఫిక్ ద్వీప దేశాలలోని చిన్న చిన్న దేశాలైనా సాల్మన్ ఐలాండ్, వనౌతు, సమోవా, కిరిబితి, మైక్రోనేషియా, టోంగా, ది మార్షల్, ఐలాండ్ పలవౌ, టువాలు, నౌతు దేశాలలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇక ఆసియాలో అయితే నార్త్ కొరియా, యెమెన్, తుర్కెమిస్థాన్, తజికిస్థాన్‌‌లలో కూడా అసలు కరోనా లక్షణాలే లేకపోవడం విశేషం.