హమ్మయ్య .. పద్మావతికి ఊరట లభించినట్టే ?

Thursday, November 30th, 2017, 11:00:28 AM IST

బాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేస్తున్న పద్మావతి సినిమా పై ఇప్పటికే వివాదాలు పెద్ద దుమారమే చెలరేగుతున్నాయి. ఈ సినిమా విడుదల ఆపాలంటూ కోర్టుకు అభ్యర్థనలు అందుతున్నాయి. అయితే కోర్టు ఈ విషయం లో పెద్ద రాద్దాంతం చేయొద్దని సినిమా విడుదల పై స్టే విదిన్చాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది. పద్మావతి సినిమా దర్శక నిర్మాతలపై క్రిమినల్ కేసులు పెట్టాలని దాఖలైన పిటిషన్ ను కూడా కోర్టు కొట్టేసింది. అంతే కాదు .. పద్మావతి సినిమా పై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పై కూడా కోర్టు సీరియస్ అయింది. సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫై చేయకముందే ఆ సినిమా పై ఎలా వాఖ్యలు చేస్తారని మండి పడింది. ఇక పద్మావతి సినిమాను ఇప్పటికే గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిషేదించాయి. ఈ సినిమాలో ఎవరిని కించపరిచే ప్రయత్నం చేయలేదని సంజయ్ లీల బన్సాలి చెప్పారు. ఇప్పటికే రాజ్ పుట్ లు తమ కులాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. దాంతో ఈ విషయం పై క్లారిటి ఇచ్చాడు దర్శకుడు. మొత్తానికి పద్మావతికి కాస్త ఊరట లభించినట్టే .. మరి విడుదల అయ్యే అవకశాలు ఎక్కువగానే ఉన్నాయి.