విద్యుత్ లేదు…నీరు లేదు… టెక్సాస్ లో మరింత పెరగనున్న చలి తీవ్రత

Thursday, February 18th, 2021, 01:10:44 PM IST

చలి తీవ్రత టెక్సాస్ లో కొనసాగుతూనే ఉంది. అక్కడ విద్యుత్ లేదు, నీరు లేదు, చీకటి రోజులు గడుపుతున్నారు టెక్సాస్ వాసులు. మునుపెన్నడూ లేని విధంగా చలి తీవ్రత ఎక్కువగా కొనసాగుతూ ఉండటం తో అధికారులు అప్రమత్తం అయి, టెక్సాస్ దేశ ప్రజలను హెచ్చరించారు.మూడవ రోజు మిలియన్ల మంది చలి ప్రభావం కారణంగా అనారోగ్యం పాలు అవుతున్నారు. వేడి లేకుండా ఉండటం చేత తీవ్ర చలి కి గురి అవుతున్నారు. వచ్చే వారాంతం వరకూ కూడా ఇదే పరిస్తితి ఉండవచ్చు అని, అంతా కూడా తట్టుకునేందుకు సిద్దం గా ఉండాలి అని అధికారులు చెబుతున్నారు.

టెక్సాస్ లో ఉన్న పరిస్థితుల వలన త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక ఆరోగ్య పరిస్తితి మెరుగు పడాలి అంటే నీటిని వేడి చేసి తాగాలి అంటూ సూచన ఇస్తున్నారు. అలా చేయడం ద్వారా కాస్త చలి తీవ్రత ఒంట్లో తగ్గే అవకాశం ఉంది. అయితే అక్కడ తాగు నీరు కూడా అక్కడక్కడ మాత్రం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉండటం తో నీరు గడ్డ కడుతుంది అని తెలిపారు. అయితే పలు చోట్ల నీరు అందుబాటు లో లేదు అని టెక్సాస్ తెలిపింది. అంతేకాక కురుస్తున్న మంచు కారణంగా ఇప్పటి వరకూ 24 మందికి పైగా ప్రాణాలను కోల్పోయినట్లు వెల్లడించింది. అయితే అందుకు అనుగుణంగా ప్రభుత్వం పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్ సైతం ఎక్కువగా విజృంభించే అవకాశం ఉండటం తో జాగ్రత్త గా ఉండాలి అని అధికారులు చెబుతున్నారు.