అక్కడ 100 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు

Sunday, August 9th, 2020, 06:00:01 PM IST

Corona_2506

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారి ను చూసి భయపడుతోంటే, ఆ దేశం లో కొత్తగా కరోనా వైరస్ సోకి వంద రోజులు దాటింది. ప్రపంచంలో చిన్న దేశం అయిన న్యూజిలాండ్ కరోనా వైరస్ మహమ్మారి ను కట్టడి చేసింది. స్థానికంగా గడిచిన 100 రోజుల్లో ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదు అని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఈ విషయం పై అక్కడి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. అయితే అక్కడ ప్రస్తుతం 23 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి అని, అవి వేరే దేశాల నుండి వచ్చిన వారు అని అధికారులు వెల్లడించారు.

అయితే కరోనా వైరస్ మహమ్మారి ను కట్టడి చేయడం లో వైద్య ఆరోగ్య శాఖ కృషి అభినందనీయం అని హెల్త్ డైరెక్టర్ జనరల్ యాష్లే పేర్కొన్నారు. అయితే వంద రోజులు గా ఒక్క కరోనా కేసు కూడా లేదు అని, మే 1 న చివరగా కరోనా కేసు నమోదు అయింది అని వివరించారు. అయితే కరోనా విజృంభిస్తున్న వేళ, మొదటి కేసు నమోదు అయినప్పటి నుండి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం కారణంగా కరోనా ను కట్టడి చేయగలిగాం అని యాష్లీ తెలిపారు.