ఆశారాంకు ఆశాభంగం

Tuesday, September 23rd, 2014, 02:21:46 PM IST


లైంగిక వేదింపుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న..ఆశారాం బాపుకు సుప్రీం కోర్ట్ లో చుక్కెదురైంది. లైంగిక వేదింపుల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆశారంకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం ఇంత తొందర ఎందుకని ప్రశ్నించింది. అనారోగ్యకారణాల వలన ఆశారాం బాపు బెయిల్ కోసం సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగ, అనారోగ్యం కారణాలతో ఆశారాంకు హడావుడిగా బెయిల్ ఇవ్వవలసిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఈ వివాదాస్పద స్వామీజీపై గుజరాత్, రాజస్తాన్ లలో అత్యాచార కేసులు నమోదు అయిన విషయం విదితమే.