ఆధార్ కార్డు ఉంటేనే కరోనా టెస్ట్ చేస్తున్న వైద్యులు.. ఇదేం పద్ధతి..!

Friday, August 14th, 2020, 10:57:59 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే తక్కువ సంఖ్యలో కరోనా టెస్టులను చేస్తున్నారని హైకోర్ట్ మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వం మాత్రం టెస్టుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

అయితే ఆధార్ లేకుంటే కరోనా టెస్టు చేయడం లేదని మరో అపవాదు తెలంగాణ ప్రభుత్వంపై వినిపిస్తుంది. ఆధార్ కార్డు లేకుంటే కరోనా టెస్టులు చేయడానికి వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారని, తల్లిదండ్రులతో కలిసి కరోనా పరీక్ష కేంద్రాలకు వెళుతున్న చిన్నారులకు ఆధార్ కార్డు లేకపోవడంతో వారికి పరీక్షలు నిర్వహించలేమని వైద్య సిబ్బంది చెబుతున్నారు. చిన్నారులకు ఇంకా ఆధార్ కార్డు తీయలేదని చెబుతున్నా వైద్యులు పట్టించుకోవడం లేదని ఇదేం పద్ధతి అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.