బలహీన పడిన నివర్ తుఫాన్

Thursday, November 26th, 2020, 10:48:50 AM IST

ఊహించని రీతిలో నీవర్ తుఫాన్ తన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే అతి తీవ్రం గా ఉన్న ఈ తుఫాన్ తీవ్రత తగ్గుతుంది. బుదవారం రాత్రి నుండి తెల్లవారు ఘామున 3 గంటల వరకు నివర్ తీరం దాటిన విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో 120 నుండి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కొద్ది గంటల పాటు దీని ప్రభావం దారుణం గా ఉందని తెలుస్తోంది. అయితే ఈ తుఫాన్ కారణం గా తమిళ నాడు లో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నెల్లూరు జిల్లాలో ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాలో కూడా ఈదురు గాలులు తో భారీ వర్షాలు కురిశాయి. అయితే దీని తీవ్ర కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.