మరోసారి హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ.. కారణం అదే..!

Thursday, September 3rd, 2020, 01:55:18 PM IST

Nimmagadda

ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం విధులలో జోక్యం చేసుకుంటూ ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టిపారేయాలంటూ పిటీషన్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, ఉద్యోగులను వేధించడానికే కేసు నమోదు చేశారని పిటీషన్‌లో పేర్కొన్నారు.

అంతేకాదు ఎన్నికల కమీషన్ నుంచి సీఐడీ తీసుకువెళ్లిన వస్తువులను ప్రభుత్వం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా హైకోర్టును కోరారు. ఇదిలా ఉంటే సీఐడీ కేసు నమోదు చేసిన వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ మరో పిటిషన్ దాఖలయ్యింది. రాష్ట్ర ఎన్నికల సహాయ కార్యదర్శి సాంబమూర్తి మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ రెండు పిటిషన్లను కలిపి సోమవారం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.