ప్రభుత్వం సహకరించాలి.. ఏపీ సీఎస్‌కు మరో లేఖ రాసిన నిమ్మగడ్డ..!

Tuesday, November 24th, 2020, 01:13:30 AM IST

Nimmagadda-Ramesh-Kumar
ఏపీ సీఎస్ నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మరో లేఖ రాశారు. రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తీర్పులో న్యాయస్థానం స్పష్టం చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని కూడా ఆ లేఖకు జతచేశారు. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ఆదేశించినట్టు కూడా లేఖలో పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎస్‍ఈసీకి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, ఎన్నికల కమీషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అని ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి కానీ రాజ్యాంగబద్ద సంస్థలు ఎప్పుడూ పనిచేస్తాయని కోర్టు వ్యాఖ్యానించిది. అంతేకాదు ఎస్ఈసీ కోరినవన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.