స్థానిక ఎన్నికల నిర్వహణ పై సీఎస్ కి నిమ్మగడ్డ లేఖ

Friday, December 11th, 2020, 01:47:08 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సి ఎస్ నీలం సాహ్ని కి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరొకసారి లేఖ రాశారు. వచ్చే ఫిబ్రవరి లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి అని అన్నారు. అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి అని వివరించారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని లేఖ లో పేర్కొన్నారు.

అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా స్థానిక ఎన్నికల తో పాటుగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్తు చేశారు. అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాలతో పాటుగా 2021 ఓటర్ల సవరణ ప్రక్రియ జనవరి నాటికి పూర్తి చేయాలని అందులో సూచించారు.అయితే ఇదే విషయం పట్ల గతం లో లేఖలు రాసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, మరొకసారి లేఖ రాయడం పట్ల వైసీపీ నేతలు, రాష్ట్ర ప్రభుత్వం, సి ఎస్ ఎలా స్పందిస్తారో చూడాలి.