నేడు ఎస్ఈసీ బాధ్యతలు చేపట్టనున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్..!

Monday, August 3rd, 2020, 07:51:26 AM IST

ఏపీ ఎన్నికల సంఘం కమీషనర్‌గా నేడు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ రోజు ఉదయం 11:15 నిమిషాలకు ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎన్నికల కమీషనర్‌గా పునర్నియమిస్తూ ఇటీవల పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే హైకోర్ట్ ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి తన నియామకం గురుంచి వివరించగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు జరిగిన పోరులో తుది విజయం నిమ్మగడ్డనే వరించింది.