నిమ్మగడ్డ పిటీషన్‌పై తీర్పు రిజర్వ్.. హైకోర్ట్ కీలక నిర్ణయం..!

Friday, October 23rd, 2020, 12:13:09 AM IST

Nimmagadda
ఏపీ ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్‌పై నేడు ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని, ఎన్నికల కమీషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపి వేసిందని పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం ప్రతిదానికి ప్రభుత్వాన్ని ఎలా సంప్రదిస్తుందని కోర్టు నిలదీసింది. అయితే ప్రభుత్వం ఏ విషయంలో సహకరించడంలేదన్న దానిపై పూర్తి అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.