రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తా.. నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు..!

Monday, August 3rd, 2020, 01:05:02 PM IST

ఏపీ ఎన్నికల సంఘం కమీషనర్‌గా నేడు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమీషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని ఏ పార్టీకి అనుకూలంగా పనిచేసే వ్యవస్థ కాదని అన్నారు.

అంతేకాదు రాగద్వేషాలకు అతీతంగా ఎస్ఈసీ పని చేస్తుందని, గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తోడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇకపోతే తాను తిరిగి ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించినట్టు జిల్లా కలెక్టర్లందరికి తెలియచేశానని అన్నారు. ఇదిలాఉంటే నిమ్మగడ్డ రమేష్ కార్యాలయానికి స్వల్ప వాస్తు మార్పులు చేశారు. ఒకవైపు పూర్తిగా మూసివేసి, మరోవైపు నుంచి చాంబర్‌లోకి ప్రవేశించేలా మార్పులు చేపట్టారు.