ఏపీ ప్రభుత్వానికి షాక్.. కోర్టు ధిక్కారణ కేసు వేసిన ఎస్ఈసీ..!

Friday, December 18th, 2020, 04:00:08 PM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నడుస్తున్న వివాదం పతాక స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఎస్ఈసీ ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ కేసు వేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఎన్నికల కమీషన్ ఆదేశాలను ప్రభుత్వం కేర్ చేయడం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఎన్నికలు పెట్టడం కుదరదని అడ్డంతిరిగి మాట్లాడుతోందని ఎస్ఈసీ నిమ్మగడ్డ హైకోర్టుకు మొరపెట్టుకున్నారు.

అంతేకాదు ప్రభుత్వం కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడంలేదని, ఎన్నికలు సజావుగా జరిగేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ నిమ్మగడ్డ హైకోర్టును కోరారు. వరుసగా అఫిడవిట్‌లు ఫైల్ చేస్తూ, మరోవైపు చీఫ్ సెక్రటరీకి లేఖలు రాస్తున్నా ప్రభుత్వం మొండిగా వైఖరించడం సరికాదని పేర్కొంటూ ప్రభుత్వంపై ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ పిటిషన్ వేయగా హైకోర్టు కూడా దీనిని స్వీకరించింది.