ఆయన కదలికలపై నిఘా పెట్టండి.. డీజీపీకి నిమ్మగడ్డ లేఖ..!

Sunday, January 24th, 2021, 03:00:28 AM IST


ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎస్ఈసీ, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య చిచ్చు రాజేసింది. తాము ఎన్నికలకు సిద్దంగా లేమని, ప్రాణాపాయం మీదకు వస్తే ఎదుటివారి ప్రాణాలు తీసేహక్కు రాజ్యాంగం ఇచ్చిందని ఏపీ ఉద్యోగాల సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. అయితే వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆయనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు.

అయితే వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, వారు మాటలు వింటుంటే భౌతిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిమ్మగడ్డ డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. అయితే దీనిపై వెంకట్రామిరెడ్డి మాత్రం తాను అలా అనలేదని ప్రాణాలు కాపాడుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చిందని మాత్రమే అన్నానని, తన మాటలను కావాలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారని వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు.