రాష్ట్ర ప్రభుత్వం పై నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు

Wednesday, February 3rd, 2021, 04:31:54 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికలకి పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అయితే ఈ ఎన్నికలను కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక యాప్ ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వెయ్యి శాతం పారదర్శకతతో ఈ వాచ్ యాప్ ను రూపొందించినట్లు నిమ్మగడ్డ తెలిపారు. అయితే పంచాయతీ ఎన్నికల కోసం ఈ యాప్ ను బుధవారం నాడు విజయవాడ లో ఎన్నికల సంఘం కార్యాలయం లో నిమ్మగడ్డ ఆవిష్కరించారు. అయితే ఈ యాప్ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం కోర్టు లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై నిమ్మగడ్డ స్పందించారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయకపోతే ఆశ్చర్య పడాలి తప్ప వేస్తే ఆశ్చర్యం ఏముంది అంటూ చెప్పుకొచ్చారు. పంచాయతి ఎన్నికల విషయం లో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు వెల్లడించిన తర్వాత ఇందులో ఎలాంటి వివాదాలకు చోటు లేదు అంటూ తేల్చి చెప్పారు. ఎటువంటి సందేహాలు, ప్రశ్నలకు తావు లేకుండా యాప్ ను రూపొందించినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరించారు. అయితే సమావేశాలతో కాలం గడపకుండా పనికే ప్రాధాన్యత ఇస్తాను అంటూ చెప్పుకొచ్చారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తాను అంటూ స్పష్టం చేశారు. అయితే నిమ్మగడ్డ వైఖరి పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.