ఫిర్యాదుల పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమన్నారు అంటే?

Thursday, March 4th, 2021, 09:40:01 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మున్సిపల్ ఎన్నికలు ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బలవంతపు ఉపసంహరణ లు సైతం జరుగుతుండటం పట్ల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఈ బలవంతపు ఉపసంహరణ లకు సంబందించి ఫిర్యాదులు రావడం తో వీటి పట్ల చర్యలు తీసుకొనేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు చేసిన ఫిర్యాదులను ఆర్వో లో పరిశీలించాలని ఆదేశించినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అయితే ఇప్పటికే రిటర్నింగ్ అధికారులకి నిర్దిష్ట సూచనలు చేసిన విషయాన్ని మరొకసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. అయితే ఫిర్యాదులు సంబందించిన ప్రతి సంఘటన పై కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది అని స్పష్టం చేశారు. తిరుపతి 7 వ డివిజన్ లో బలవంతపు ఉపసంహరణ కి సంబందించి ఫిర్యాదు రావడం పట్ల స్పందించారు. అందుకు సంబంధించిన ఘటన పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే బాధితులు తమ సమస్యల పరిష్కారం కొరకు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు రావాలని పేర్కొన్నారు.