బిగ్ న్యూస్: ఏకగ్రీవాల పై మరొకసారి నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు

Thursday, February 4th, 2021, 12:36:57 PM IST

Nimmagadda-Ramesh-Kumar

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయం లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. నాయకత్వ బాధ్యతల కోసం పోటిపడటం శుభపరిణామం అంటూ నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు.అయితే ఈ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే మరొకసారి ఏకగ్రీవాల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏకగ్రీవాలు శృతిమించితే అధికారుల వైఫల్యాల కిందకి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల వలన గ్రామాల్లో విఘాతాలు వస్తాయి అని తాను భావించడం లేదు అని, ఈ ఎన్నికలు పూర్తి అయ్యాక అందరూ కలిసే ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ, నెల్లూరు లో గతం లో 83 శాతం పోలింగ్ నమోదు అయింది అని వ్యాఖ్యానించారు. అయితే ఈ సారి అంతకంటే ఎక్కువగా పోలింగ్ నమోదు అయ్యే విధంగా కృషి చేయాలి అంటూ అధికారులకు పిలుపు ఇచ్చారు.అయితే గ్రామాభివృద్ధి లో సర్పంచ్ లదే కీలక పాత్ర అని, గతంలో జరిగిన తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా అయ్యేలా చూడాలి అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పుకొచ్చారు. అయితే మరొకసారి నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చంశనీయంగా మారింది.