నిజామాబాద్ స్థానిక ఉప ఎన్నిక కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తి!

Sunday, October 11th, 2020, 04:35:27 PM IST

తెలంగాణ రాష్ట్రం లో నిజామాబాద్ లో స్థానిక సంస్థల ఉప ఎన్నిక కి సంబంధించిన కౌంటింగ్ రేపే జరగనుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు సైతం పూర్తి అయ్యాయి. అయితే సోమవారం నాడు ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుండగా, మొత్తం 824 కి గానూ, 823 ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఇందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రెండు ఉండగా ఓట్ల లెక్కింపు రెండు రౌండ్ లలో 6 టేబుళ్ళ మీద జరగనుంది.

అయితే మొదటి రౌండ్ లో 600 ఓట్లను రెండో రౌండ్ లో మిగతా 223 ఓట్లను లెక్కిస్తారు. అయితే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ లో ఒక్కొక్క పార్టీ కి ఎనిమిది మంది ఎజెంట్ లకి అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఈ ఉప ఎన్నిక పై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలై మూడు గంటల్లో కౌంటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. అంటే సోమవారం ఉదయం 11 గంటల వరకు గెలిచిన అభ్యర్దిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి నిబంధనలను పాటిస్తూనే ఈ ప్రక్రియ జరగనుండి. తెరాస నుండి కవిత, బీజేపీ నుండి లక్ష్మీ నారాయణ, కాంగ్రెస్ నుండి సుభాష్ రెడ్డి లు పోటీ చేయగా, వీరి భవితవ్యం రేపు తెలనుంది.