పార్లమెంట్ లో నిర్వహించని ఎన్.టి ఆర్ జయంతి

Saturday, June 1st, 2013, 12:40:11 AM IST


దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు జయంతి సందర్భంగా రాష్ట్రము మొత్తం ఆయన జన్మదిన వేడుకలను జరుపుకుంటే పార్ల మెంట్ లో మాత్రం ఎటువంటి కార్యక్రమాలు చేయకపోవడంపై తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ(తెదేపాపా) తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దివంగత నేతల జయంతి, వర్దంతి కార్యక్రమాలను పార్లమెంట్ సెంట్రల్ హాల్ లలో పుష్పాంజలి ఘటించే బులిటేన్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. కానీ ఎన్.టి.ఆర్ జయంతిని మాత్రం మర్చిపోయారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం గర్వించ దగ్గ నేత మరియు లోక్ సభలో ప్రతిపక్ష హోదాని పొందిన తోలి ప్రాంతీయ పార్టీని స్థాపించిన ఆయన జయంతిని మరిచిపోవడం నిజంగా భాదకరంమైన విషయం. ఈ విషయం పై తెదేపాపా నేతలు స్పీకర్ మీరా కుమార్ కి లేఖను సమర్పించారు.