తను చాలా నిరాడంబరంగా ఉంటాడు…నటరాజన్ పై కేన్ విలియమ్సన్ ప్రశంసలు

Wednesday, February 3rd, 2021, 07:33:24 PM IST

ఆసీస్ టూర్ లో మూడవ వన్డే తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన నటరాజన్, టీ 20 తో పాటుగా టెస్ట్ క్రికెట్ లో కూడా అద్భుతంగా రాణించాడు. మూడు ఫార్మాట్ లలో కలిపి మొత్తం మూడు వికెట్లు పడగొట్టి చారిత్రాత్మక విజయం లో కీలక పాత్ర పోషించారు.అయితే అతని పై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ ప్రశంసల వర్షం కురిపించారు. నటరాజన్ అద్భుతమైన వ్యక్తి అని, ఐపిఎల్ లో బాగా రాణించాడు అని అన్నారు. నెట్ బౌలర్ గా ఆస్ట్రేలియా చేరుకున్న అతనికి అవకాశాలు మెరుగు పడ్డాయి అని అన్నారు.

గబ్బా టెస్ట్ లో టీమ్ ఇండియా చిరస్మరణీయ విజయంలో తన పాత్ర ఉండటం నిజంగా సంతోషకరం అంటూ చెప్పుకొచ్చారు.ఇంతటి ప్రతిభ ఉన్న వ్యక్తి నాకు సహచర ఆటగాడు అవ్వడం నాకు గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఐపిఎల్ లో సన్ రైజర్స్ తరపున నటరాజన్ ఆడిన సంగతి అందరికీ తెలిసిందే. నటరాజన్ తో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని అని కేన్ తెలిపారు. అయితే తాను చాలా నిరాడంబరంగా ఉంటాడు అని, అద్భుత ప్రతిభ కలవాడు అని, టీమ్ ఇండియా కి దొరికిన మంచి ఆటగాడు అని, అయితే అతి తక్కువ సమయంలో యువ క్రికెటర్ నుండి పరిణితి కలిగిన ఆటగాడి గా రూపాంతరం చెందాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే కేన్ అంతటి గొప్ప ఆటగాడు టీమ్ ఇండియా బౌలర్ పై ప్రశంసల వర్షం కురిపించడం పట్ల అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.