నూతన సంవత్సర వేళ విషాదం – లిఫ్ట్ కూలి 6 మంది దుర్మరణం…

Wednesday, January 1st, 2020, 08:37:33 AM IST

ప్రప్రాంచమంతటా కూడా కొత్త సంవత్సర వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో మధ్యప్రదేశ్ లో ఒక దారుణమైన విషాదం చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతంలోని ఇండోర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహూలోని ఓ ఫామ్ హౌస్‌లో ఒక భవంతికి తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి లిఫ్ట్ ఒక్కసారిగా కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. అంతేకాకుండా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఇండోర్‌లోని పాటల్‌పానీలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. అయితే ఈ ఘటన కి సంబందించిన సంచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

కాగా మృతుల్లో పునీత్ అగర్వాల్, ఆయన కుమార్తె పలక్ తో పాటు మరొ నలుగురు మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు మరో నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు సమాచారం అందించారు. ఇకపోతే గాయపడ్డ ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కూడా వెల్లడించారు. కాగా అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, లిఫ్ట్ ఎందుకు కూలిందన్న దానిపై సరైన వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.