హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ఆంక్షలు ఇవే..!

Thursday, December 31st, 2020, 12:31:27 AM IST


కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వం నిషేదం విధించింది. హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సరపు వేడుకల‌పై ఆంక్షలు విధిస్తున్నట్టు ఇప్పటికే పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భాగంగా రేపు రాత్రి నుంచి జనవరి 1వ తేది వరకు బేగంపేట ఫ్లైఓవర్‌ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు.

అయితే సైబర్‌ టవర్స్‌, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ ప్లైఓవర్లు, జేఎన్‌టీయూ, మైండ్‌స్పేస్‌, దుర్గం చెరువు తీగల వంతెనలను మూసివేస్తున్నామని, అలాగే పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డుపైకి కార్లను అనుమతించబోమని తెలిపారు. ఇక నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌, బీఆర్‌కే భవన్‌, తెలుగు తల్లి కూడలి, లిబర్టీ జంక్షన్‌, నల్లగుట్ట రైల్వే వంతెన వద్ద వాహనాలను దారి మళ్లించబోతున్నామని తెలిపారు. వీటిని గుర్తించుకుని ప్రజలు పోలీసులకు సహకరించాలని నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.