తెలంగాణ లో కొత్త రకం కరోనా కేసులు – కేంద్ర ప్రభుత్వం

Wednesday, February 24th, 2021, 09:30:26 AM IST

తెలంగాణ రాష్ట్రం ను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా కొత్త రకం కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ కొత్త రకం కరోనా వైరస్ కేసులు ఎక్కువగా మహారాష్ట్ర మరియు కేరళ లో నమోదు అవుతున్నట్లు తెలిపారు. అయితే ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏడు రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. అందులో తెలంగాణ కూడా ఉంది.తెలంగాణ రాష్ట్రం లో కొత్త రకం కరోనా వైరస్ కేసులు ఉన్నాయి అని కేంద్రం అప్రమత్తం చేసింది.కేంద్రం తెలిపిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొత్త రకం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విజృంభణ తో పలు చోట్ల ఆంక్షలు విధించడం జరిగింది.