భారత్ లో పెరుగుతున్న కొత్త రకం కరోనా కేసులు

Wednesday, December 30th, 2020, 10:08:25 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి ఉదృతి కొనసాగుతూనే ఉన్న సమయం లో కొత్తగా స్ట్రెయిన్ కరోనా అంటూ ప్రజలను భయ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆరు కొత్త కరోనా వైరస్ కేసులను గుర్తించిన ప్రభుత్వం తాజాగా మరో 14 కేసులను గుర్తించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ కేసుల సంఖ్య 19 వరకు ఉండే అవకాశం ఉందని తెలుపగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలపడం తో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. అయితే కొత్తరకం కరోనా సోకిన బాధితులను ప్రత్యేక ఐసోలేషనో ఉంచగా, పలు రాష్ట్రాల్లో ఉన్న కొత్త రకం కరోనా వైరస్ బాధితుల తో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో యూ కే వైరస్ సోకిన విషయం తో అలెర్ట అయ్యాయి. అయితే కొత్త రకం వైరస్ కోసం 10 ప్రయోగ శాలలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 వరకు మొత్తం 33 వేల మంది బ్రిటన్ నుండి భారత్ కి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కరోనా వైరస్ యాంటీ బాడీస్ నుండి కూడా ఈ కొత్త రకం కరోనా వైరస్ తప్పించుకుంటుంది అంటూ వార్తలు రావడం తో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.