దుబ్బాక ఫలితంపై సరికొత్త సర్వే.. గెలుపు ఎవరిదంటే?

Sunday, November 8th, 2020, 10:20:35 AM IST

హోరాహోరీగా సాగిన దుబ్బాక ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే విషయం మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. అయితే టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొటీ ఎక్కువగా కనిపించడంతో ఈ రెండు పార్టీలలోనే గెలుపు అవకాశాలు ఉండవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు ముగిశాక వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌ కూడా భిన్నమైన ఫలితాలను బయటపెట్టాయి. పొలిటికల్ ల్యాబోరేటరీ అనే సంస్థ బీజేపీది విజయమని తేల్చగా, మరో ఎగ్జిట్ పోల్ సంస్థ థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) టీఆర్ఎస్‌దే విజయమని తెలిపింది.

అయితే తాజాగా దుబ్బాక ఫలితంపై ఆరా సంస్థ పోస్ట్ పోల్ సర్వేను బయటపెట్టింది. మొత్తన్ పోలైన ఓట్లలో టీఆర్ఎస్‌కు 48.72 శాతం, బీజేపీకి 44.64 శాతం ఓట్లు వస్తాయని కాంగ్రెస్‌కు 6.12 శాతం ఓట్లు, ఇతరులకు 2.52 శాతం వస్తాయని చెప్పుకొచ్చింది. అయితే తమ సర్వేలో వచ్చిన ఫలితాలకు మూడు శాతం ఓట్లు అటు ఇటు రావచ్చని, టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓట్ల శాతంలో తేడా స్వల్పంగానే ఉంటుండటంతో ఫలితం కూడా ఎలాగైనా ఉండవచ్చు అని తెలిపింది.