విల్లు ఎక్కుపెట్టిన వీరుడిలా.. రామ్ చరణ్ పోస్టర్ అదిరిపోయిందిగా..!

Friday, March 26th, 2021, 04:43:02 PM IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం రామ్ చరణ్‌కు అదిరిపోయే పుట్టినరోజు కానుకగాను గిఫ్ట్‌గా ఇచ్చింది. అల్లూరి సీతారామరాజుగా కనిపించే రామ్ చరణ్ కలర్‌పుల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో రామ్ చరణ్ విల్లు ఎక్కు పెట్టి యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది. ఈ పోస్టర్‌ను ట్వీట్ చేసిన దర్శకుడు రాజమౌళి ధైర్యం, గౌరవం, సమగ్రత కలిగిన మా అల్లూరి సీతారామరాజును మీకు పరిచయం చేస్తున్నాని ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాలో గొప్ప లక్షణాలు ఉన్న సోదరుడు ఇతనంటూ ఎన్టీఆర్ కూడా ఈ పోస్టర్‌ను ట్వీట్ చేశాడు. ఏదేమైనా రోజు రోజుకు మరిన్ని అంచనాలు నెలకొల్పుతున్న ఈ సినిమా అక్టోబర్ 13న రిలీజ్ కాబోతుంది.