కరోనా లాక్‌డౌన్: విశాఖలో రేపటి నుంచి కొత్త రూల్స్..!

Thursday, March 26th, 2020, 02:30:30 AM IST

ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే విశాఖలో ఇప్పటికే మూడు కేసులు నమోదు కావడంతో దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సర్కార్ ఇక్కడ మరిన్ని ఆంక్షలను విధించేందుకు సిద్దమయ్యింది.

అయితే జిల్లాలోని ప్రజలకు రేపటి నుంచి ఉదయం 6 నుంచి 9 గంటల వరకే అంటే మూడు గంటలు మాత్రమే రోడ్ల మీదకి అనుమతి ఇస్తారు. ఇకపోతే రైతు బజార్లు, ఫ్రూట్ మార్కెట్‌లు ఉదయం 6 నుండి 9 వరఅకు మాత్రమే తెరిచి ఉంటాయి. ఉదయం 4 నుంచి 8 వరకు మిల్స్ & డైరీ ప్రొడెక్ట్ అందుబాటులో ఉంటాయని, ఉదయం 5 నుంచి 9 వరకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి ఉంటుంది.

ఉదయం 5 నుంచి 9 వరకు ఏటీయం, ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు టేక్ ఎవే హోటల్స్‌కు, ప్రభుత్వ, పోలీస్, ఫైర్, విద్యుత్, రెవిన్యూ, వీఎంసీ, మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు వెహికల్స్ కు మాత్రమే 24 గంటల అనుమతి ఉంటుంది. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికిల్స్‌కు, ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్టు అధికరులు కొత్త రూల్స్‌ని ప్రకటించారు. అయితే వీటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.