ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. కొత్త ఇండస్ట్రీయల్ పాలసీ..!

Monday, August 10th, 2020, 01:54:47 PM IST

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు కొత్త ఇండస్ట్రీయల్ పాలసీనీ తీసుకువచ్చింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో నూతన పారిశ్రామిక విధానాన్ని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజాతో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ వైఎస్సార్ వన్ పేరుతో ప్రారంభమైన ఈ కొత్త విధానం ద్వారా సూక్ష్మ మరియు చిన్నతరహా పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సీడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఈ నూతన విధానాన్ని మూడేళ్లకే రూపొందించినట్టు చెప్పుకొచ్చారు. ఈ కొత్త పాలసీతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉంటుందని వారు తెలిపారు.