ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ సభ్యులు ఖరారు.. ఎవరెవరెంటే..!

Friday, August 7th, 2020, 06:32:03 PM IST

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. మొత్తం 25 లేదా 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తాజాగా జిల్లాల పునర్విభజనపై కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉండేలా ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే సీసీఎల్ఏ కమీషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైన్సాన్స్ సెక్రటరీ సభ్యులుగా కొనసాగుతారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు కావలసిన వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. మూడు నెలల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.