ఏపీకి త్వరలో కొత్త సీఎస్‌.. ఆయన పేరు ఫైనలైనట్టేనా?

Friday, December 11th, 2020, 03:42:26 PM IST

ఏపీకి త్వరలో కొత్త సీఎస్ రాబోతున్నారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవికాలం ఈ నెలాఖరుకు ముగియనుండడంతో ఈ పదవికి సీఎం జగన్ ఎవరిని నియమిస్తారనేది ఇప్పుడు చర్చాంశనీయాంగా మారింది. సీనియార్టీ ఆధారంగా కొత్త సీఎస్ ఎంపిక జరగాల్సి ఉన్న నేపధ్యంలో ప్రధానంగా ఆదిత్య నాథ్ దాస్‌ పేరు బలంగా వినిపిస్తోంది.

అయితే ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని తరువాత అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఏస్వీ ప్రసాద్, నీరబ్ కూమార్ ప్రసాద్ ఉన్నారు. వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుభ్రమణ్యం కేంద్ర సర్వీసులో ఉన్నారు. అయితే చంద్రబాబు హయాంలో సీఎస్‌గా పని చేసిన సతీష్ చంద్రను మళ్లీ నియమించేందుకు సీఎం జగన్‌ సుముఖత చూడంలేదని తెలుస్తుంది. ఇక మరో అధికారి నీరభ్ కూమార్ సర్వీస్‌ 2024 వరకు ఉండటంతో అప్పటివరకు సీఎస్‌గా ఉంచలేమని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే గతంలో జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. అయితే సీఎం జగన్‌ ప్రస్తుతం ఆదిత్యనాథ్‌ను ఎంపిక చేసేందుకే మొగ్గు చూపుతుండటంతో ఆదిత్యనాథ్‌ దాస్‌ కొత్త సీఎస్‌గా ఖరారవ్వటం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తుంది.