ఎంపీ విజయసాయి రెడ్డి పై నెటిజన్ల ఘాటు విమర్శలు..!

Wednesday, August 26th, 2020, 04:37:06 PM IST

Ycp-mp-Vijayasai-reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ కి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దళితుల పై దాడులను ఏ మాత్రం ఉపేక్షించబోము అని సీఎం జగన్ గారు స్పష్టం చేశారు అని తెలిపారు. పోలీస్ అధికారులు అయినా జైలు తప్పదు అంటూ తేల్చి చెప్పారు, దళితులు గా పుట్టాలి అని ఎవరు కోరుకుంటారు అన్న జూమ్ బాబు ఎక్కడ? వారు అభ్యుదయం కోసం కృషి చేస్తున్న జగన్ గారు ఎక్కడ అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయన తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల దళిత వ్యక్తి కి శిరో ముండనం, చీరాల లో కొట్టి మరొక వ్యక్తి ను కొట్టి చంపిన విషయం, ఇంకా పలు రకాల అంశాలను లేవనెత్తి విజయ సాయి రెడ్డి ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అయితే కౌంటర్ గా పలువురు వైసీపీ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యల పై తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.