వ్యవసాయ బిల్లు మద్దతు విషయంలో వైసీపీ ఎంపీ పై నెటిజన్ల ఘాటు వ్యాఖ్యలు

Tuesday, December 8th, 2020, 11:36:26 AM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేస్తూ మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి. వ్యవసాయ బిల్లుపై మారు మాట్లాడకుండా మద్దతు ఇచ్చాడు బాబు అంటూ వ్యాఖ్యానించారు. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయాలని, కనీస మద్దతు ధర ఉండాల్సిందే అని, వైసీపీ ఎంపీ లం అయిన మేము పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడాం అంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. మూడు వ్యవసాయ బిల్లుల పై ఒక్క సవరణ అయినా సూచించావా బాబు అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు కి హెరిటేజ్ ప్రయోజనాలు ఎక్కువ అయిపోయాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వ్యవసాయ బిల్లుకి వైసీపీ మద్దతు ఇచ్చిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తూ పోస్ట్లు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా బయటికి వచ్చి బిల్లుకి వ్యతిరేకంగా పోరాడండి లేదంటే ప్రతి పక్ష పార్టీ పై ఇలాంటి విమర్శలు చేయకండి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వరుస గా వైసీపీ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.