ఎంపీ విజయసాయి రెడ్డి కి గట్టి కౌంటర్ ఇస్తున్న నెటిజన్లు

Tuesday, December 1st, 2020, 08:45:51 PM IST

Ycp-mp-vijayasai-reddy2

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు ను ఉద్దేశిస్తూ ఘాటు విమర్శలు చేశారు. నువ్వు రైతుల కోసం అంటూ చేసే డ్రామాలు, పగటి వేషాలను ఎవ్వరూ నమ్మరు బాబూ అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయం దండగ అన్నావ్, బషీర్ బాగ్ లో రైతుల పై కాల్పులు జరిపించావ్, గతం లో రైతు ఆత్మహత్యలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధానిగా మార్చేశావ్, వైఎస్సార్ ఉచిత విద్యుత్ అంటే తీగల పై బట్టలు ఆరేసు కోవాలా అంటూ చంద్రబాబు నాయుడు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. అధికారం వచ్చాక హోదా తెచ్చారా, పెట్రోల్, విద్యుత్ ఛార్జీలు పెంచడం నుండి, 70 రూపాయలు ఉండే నూనె 140 రూపాయలకు పెంచి, అదే తరహాలో అన్ని నిత్యావసరాల సరుకుల ధరలు పెంచిన విషయాన్ని గుర్తు చేస్తూ సెటైర్స్ వేశారు. ఇసుక, సిమెంట్ ధరలు పెంచారు అని, వాహనాల చలాన లు పెంచారు అని, ఎప్పుడు లేని విధంగా టోల్ ఫీజ్ వసూలు చేస్తున్నారు అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. కొందరు మాత్రం టీడీపీ నేతల తీరును తప్పుబడుతూ వరుస విమర్శలు చేస్తున్నారు.