సమంతకి నెటిజన్ పెళ్లి ప్రపోజల్…సమంత ఏమన్నారో తెలుసా?

Friday, November 6th, 2020, 03:16:17 PM IST

సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు సెలబ్రిటీ లకు, అభిమానులకు సంభాషణ తేలికగానే జరుగుతుంది. సెలబ్రిటీలు అభిమానుల తో తరచూ మాట్లాడుతూ ఉండటం ఈ మధ్యనే మనం చూస్తున్నాం. అయితే ఒక నెటిజన్ చేసిన పెళ్లి ప్రపోజల్ కి సమంత బదులు ఇచ్చింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే నాగ చైతన్య కి విడాకులు ఇచ్చేయ్, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ ఒక నెటిజన్ సమంత ను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. అయితే అందుకు సమంత బదులు ఇచ్చింది. కష్టం, ఒక పని చెయ్, చై ను అడుగు అంటూ సమాధానం ఇచ్చింది. అయితే నెటిజన్లు సమంత ఇచ్చిన రిప్లై కి ఫిదా అవుతున్నారు. సమంత చాలా తేలిగ్గా తీసుకొని రిప్లై ఇవ్వడంతో భలేగా జవాబు ఇచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ నెటిజన్ ది మాత్రం లక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే వరుస సినిమాలు చేసి ఉన్న సమంత ఇప్పుడు ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ సీక్వెల్ మినహా మిగతా ఏ చిత్రాలను కూడా అంగీకరించలేదు. సమంత కి సంబందించిన చిత్రాల పై ఇంకా అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.