నేను లోకల్ .. పక్కా హిట్

Saturday, February 4th, 2017, 09:47:38 AM IST


నేను లోకల్ అంటూ హీరో నానీ సడన్ గా ఫీల్డ్ లోకి అడుగు పెట్టేసాడు. మనకి వస్తున్న రెవెన్యూ సమాచారం ప్రకారం డబల్ హ్యాట్రిక్ ని నానీ సాధించాడు అనే అంటున్నారు. శుక్రవారం ఈ సినిమా మంచి అంచనాల మీద విడుదల అయ్యి మార్నింగ్ షో లలో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా నైట్ ఫామిలీ షో ల టైం కి హిట్ టాక్ తో బయటకి వచ్చింది. కంటెంట్ చాలా రొటీన్ అయినా కూడా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రేక్షులకీ బాగా నచ్చేసింది అంటున్నారు. మాస్.. క్లాస్ అని లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. సినిమా హిట్ అనడంలో ఎలాంటి సందేహం లేదని సాయంత్రానికి క్లారిటీ వచ్చేసింది.