లైంగిక వేధింపులపై దైర్యంగా మాట్లాడండి అంటున్న హాట్ భామ ?

Monday, November 13th, 2017, 10:00:29 AM IST

సినిమా రంగంలో హీరోయిన్స్ పై జరుగుతున్న లైంగిక వేధింపులపై బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ గట్టిగా చెబుతుంది హాట్ భామ నేహా ధూపియా ? ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా సినిమా హీరోయిన్స్ పై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయం పై పలువురు హీరోయిన్స్ ఇప్పటికే బాహాటంగా తమ అభిప్రాయాలను చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం గురించి బాలీవుడ్ హాట్ భామ నేహా ధూపియా స్పందించింది. బాలీవుడ్ పరిశ్రమలోనే కాదు ఇతర రంగాల్లో ఎవరైతే లైంగిక వేధింపులకు గురయ్యారో వారంతా బయటికి రావాలని, దైర్యంగా మాట్లాడాలి. ఈ రోజు మనకు జరిగింది రేపు మరో అమ్మాయికి జరగవచ్చు .. అందుకే మనం మాట్లాడడం వల్ల ముందు ముందు వచ్చే హీరోయిన్స్ ఇలాంటి వేధింపులకు గురికాకుండా జాగ్రత్త పడతారు అని చెప్పింది. మరి ఈ విషయం పై ఎవరెలా స్పందిస్తారో చూడాలి.