కీర్తి .. కాస్త ఈ రూమర్స్ రాకుండా చూసుకో ?

Saturday, October 7th, 2017, 09:47:44 AM IST


నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ హీరోయిన్ గా మారిన అందాల భామ కీర్తి సురేష్ కు అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో టాలీవుడ్ లో మంచి డిమాండ్ పెరిగింది. ఇక పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేయడంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు సావిత్రి జీవిత కథతో మహానటి సినిమాలో నటిస్తున్న కీర్తి పై తెగ నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. అదేమిటంటే ఈ అమ్మడు .. అటు షూటింగ్ లకు గాని, ప్రమోషన్ విషయంలో కానీ టైం కు రావడం లేదట, దాంతో షూటింగ్ లో చాలా నష్టం వస్తుందని, కీర్తి వల్ల లొకేషన్ లో వెయిట్ చేయాల్సి వస్తుందని … దానివల్ల డబ్బు .. సమయం వృధా అవుతున్నట్టు నిర్మాతలు కంప్లైంట్ చేస్తున్నారు. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా అటు కోలీవుడ్ లోకూడా ఈ అమ్మడి పరిస్థితి ఇలాగే ఉందట? ఇలా కెరీర్ మొదట్లోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే అది కెరీర్ కి మంచిది కాదని పెద్దలు హితవు పలుకుతున్నారు. మరి కీర్తి ఇప్పటికైనా ఇది తెలుసుకుని టైం మైంటైన్ చేస్తే బాగుంటుందని.