ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ : ఎన్డీయేకు 279, యూపీఏకు 103

Thursday, May 15th, 2014, 02:52:58 PM IST


ఎన్డీయే కూటమి 279 స్దానాలు గెలుచుకొని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎన్డీటీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో వెల్లడైంది. మొత్తం 543 లోక్ సభ స్దానాల్లో బీజేపీ సొంతంగా 235 సీట్లు గెలుచుకుంటుందని ఎన్డీటీవీ తెలిపింది.ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మొత్తం స్దానాల్లో 79 సీట్లు గెలుచుకుంటుందని, యూపీఏ కూటమి కేవలం 103 సీట్లతో సరిపెట్టుకుంటుందని ఎన్డీటీవీ తెలిపింది.

ఇక యూపీఏయేతర, ఎన్డీఏ యేతర స్దానిక పార్టీలు, వామపక్షాలు 116 స్దానాలు గెలుచుకోవచ్చని ఎన్డీటీవీ పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీ 17 స్దానాల్లో 11 స్దానాలు, కాంగ్రెస్ 3, టీడీపీ బీజేపీ కూటమి 2, ఇతరులు 1 స్దానాన్ని గెలుచుకోవచ్చని ఎన్డీటీవీ అభిప్రాయపడింది. అలాగే సీమాంధ్ర ప్రాంతంలో టీడీపీ -బీజేపీకూటమి, వైసీపీ ల మధ్య పోటీ హొరాహొరీగా ఉంటుందని, ఈ పోటీ లో టీడీపీ మొత్తం 13 స్దానాలు, వైసీపీ 12 స్దానాలు గెలుచుకోవచ్చని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ లో వెల్లడైంది.