ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ : టీడీపీ- వైసీపీ మధ్య హొరాహొరీ

Thursday, May 15th, 2014, 02:50:04 PM IST


ఎన్డీటీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వైసీపీ , టీడీపీ కూటమి ల మధ్య పోటీ హొరాహొరీగా ఉండబోతోందని వెల్లడైంది. మే16 న వెల్లడయ్యే ఫలితాల్లో టీడీపీ, వైసీపీ లు దాదాపు సమానం గా సీట్లు గెలుచుకొనే అవకాశం ఉన్నప్పటికీవైసీపీ సుమారు 80 నుంచి 100 సీట్లు, టీడీపీ 75 నుంచి 90 సీట్లు, ఇతరులు 5 నుంచి 15 స్దానాలు గెలుచుకోవచ్చని ఎన్డీటీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో తెలిపింది. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే టీడీపీ 13, వైసీపీ 12 సీట్లు గెలుచుకోవచ్చని ఎన్డీటీవీ వెల్లడించింది.

ఇక తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ 66 నుంచి 80 స్దానాలు గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ పార్టీ 18 నుంచి 30 స్దానాలు, టీడీపీ కూటమి 8 నుంచి 16 స్దానాలు, మిగిలిన స్దానాలను ఇతరులు గెలుచుకోవచ్చని ఎన్డీటీవీ తెలిపింది. పార్లమెంట్ స్దానాల్లో టీఆర్ఎస్ పార్టీ 17 స్దానాల్లో 11 స్దానాలు, కాంగ్రెస్ 3, టీడీపీ బీజేపీ కూటమి 2, ఇతరులు 1 స్దానాన్ని గెలుచుకోవచ్చని ఎన్డీటీవీ అభిప్రాయపడింది.