నాయిని కుటుంబంలో మరో విషాదం.. వారం రోజుల్లోపే..!

Tuesday, October 27th, 2020, 01:08:47 AM IST


టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. నాయిని మృతి చెంది వారం రోజులు కూడా కాలేదు అప్పుడే ఆయన సతీమణి అహల్య కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. అయితే నాయినితో పాటు ఆమె కూడా కరోనా భారీన పడింది. అయితే కరోనా నుంచి కోలుకున్నా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

అయితే నేడు అమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే నాయినిని కడసారి చూసేందుకు ఆమెను అపోలో అస్పత్రి నుంచి మినిస్టర్‌ క్వార్టర్స్‌కు వీల్‌చైర్‌లో తీసుకువచ్చారు. వీల్‌చైర్‌లోనే కూర్చోబెట్టి భర్త భౌతిక కాయాన్ని చూపించారు. అయితే ఆమె పరిస్థితిని చూసి ప్రతిఒక్కరు కన్నీటీ పర్యంతం అయ్యారు.