రెండు డబుల్ డెక్కర్లు మనకే

Wednesday, February 12th, 2014, 07:17:24 PM IST

kharge
బుధవారం నాడు ఆందోళనల మధ్యే లోక్ సభ లో రైల్వే బడ్జెట్ ను మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో 72 కొత్త రైళ్ళను ప్రవేశ పెట్టగా అందులో దక్షిణ మధ్య రైల్వే కు 15 రైళ్ళు లభించాయి. బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన రెండు రైళ్ళు దక్షిణ మధ్య రైల్వేకు దక్కడం విశేషం.

రైల్వే బడ్జెట్ లోని ముఖ్యంశాలు :

* ప్రతి పాదించిన 72 కొత్త రైళ్ళలో 38 ఎక్స్ ప్రెస్, 17 ప్రీమియం, 10 పాసెంజర్, 3 డెమో, 4 మెమో రైళ్ళు ఉన్నాయి.

* చప్రా, రాయ్ బరేలీ లలో కోచ్ ఫ్యాక్టరీ లు త్వరలో ప్రారంభం

* 4,556 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు

* 2,027 కిలోమీటర్ల మేర లైన్ల నిర్మాణం పూర్తీ

* ప్రత్యెక రవాణా సరఫరా కొరకు పాసెంజర్ రైళ్ళను నడిపే అవకాశం

* అరుణా చల్ , మేఘాలయ మధ్య మరిన్ని సేవలు

* ఖద్రాక్ష – వైష్ణోదేవి మధ్య ప్రారంభానికి సిద్దంగా ఉన్న రైలు మార్గం

* తూర్పు – పశ్చిమ ప్రత్యెక రవాణా కారిడార్ కు కట్టు బడి ఉన్నట్లు ప్రకటించారు.

* వారానికి ఒక రోజు గూడూరు మీదుగా యశ్వంత్ పూర్ – హౌరా ఎక్స్ ప్రెస్

* ప్రతి రోజు గున్పుర్ – విశాఖపట్నం మధ్య పాసెంజెర్ రైలు

* రేణిగుంట – ఔరంగాబాద్ మధ్య వారానికి ఒక సారి

* హుబ్లి – విజయవాడ ఎక్స్ ప్రెస్ కు వారానికి మూడు రోజులకు బదులు ప్రతీ రోజు సర్వీసు

* కొత్తగూడెం – లక్నో ల మధ్య వారానికి మూడు రోజులు ఎక్స్ ప్రెస్

* నాగర్ కోయిల్ – కాచిగూడ మధ్య వారానికి ఒక రోజు ఎక్స్ ప్రెస్ రైలు

* కాజీపేట, విజయవాడ మీదుగా విశాఖ-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్

* హైదరాబాద్- గుల్బర్గా మధ్య ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

* గుంటూరు – కాచిగూడ మధ్య డబుల్ డెక్కర్

* కాచిగూడ – తిరుపతి మధ్య డబుల్ డెక్కర్